NTV Telugu Site icon

CM Revanth Reddy : కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడు

Revanth

Revanth

వరంగల్ తూర్పు సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు ధన్యావాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, పీవిని ప్రధాని చేసిన ఘటన ఓరుగల్లుకు ఉందన్నారు. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమనికి ఊపిరిపోసింది, కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. జూన్ 30తారీఖు వరకు వరంగల్ కు 3 కోట్ల నిధులు ఇస్తామని, మే9 తేది లోపు ప్రతి రైతుకు నగదు ఖాతాల్లో వేస్తామని, కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది మీరు కాదా అని ఆయన అన్నారు. 2018 ఎన్నికల సమయంలో రైతు బంధు నిధులూ వేయలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలే అని, ఎన్నికల సంఘం నాకు నోటీసులు ఇచ్చిందన్నారు.

అంతేకాకుండా..’ఏది ఏం అయిన రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తా 9 వ తేదిన అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నెల రాకేందుకు సిద్ధంగా ఉండు కేసీఆర్. 10ఏళ్లలో వరంగల్ కు చేసింది ఏం లేదు. 100రోజులు కుడా అధికారంలేకుండా ఉండాలేకపోతున్నారు తండ్రి కొడుకులు. కేసీఆర్ కు పదవి అనేది కల… 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 500 గ్యాస్ ఇచ్చింది కాంగ్రెస్, నీళ్ళు నిధులు నియమాకాలు తెలంగాణ ఉద్యమం టాగ్ లైన్, కానీ 10ఏళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలనే, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నావు, కేసీఆర్ కు బుద్ధి ఉంటే అసెంబ్లీ లో చర్చకు రావాలి.. ప్రతిపక్ష నేతగా, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు. కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడు, 7లక్షల కోట్ల అప్పును మోపింది మీరు కాదా కేసీఆర్, వరంగల్ ను ఒక గొప్ప నగరంగా తీర్చిదీదుతాం, మాదిగాల వర్గీకరణ చేయాలి అంటే లోక్ సభ లో కొట్లాడాలి, కావాలి కడియం కావ్య ను గెలిపించుకోవాలి, బీజేపీ అభ్యర్థి అనకొండ కాదా, చీకటి ఒప్పందం ప్రకారం భాజపా లో ఆరూరికి టికెట్ ఇచ్చారు, మోడీ వరంగల్ ప్రజలకు సమాధానం చెప్పి‌‌… వరంగల్ లో అడుగు పెట్టాలి, మోడీ 10ఏళ్లలో వరంగల్ కు చేసింది ఏం లేదు, బీజేపీ నాయకులకు వాత పెట్టాలి, నమో అంటే.. నమ్మించి మోసం చేసే వాడు, అవినీతి పరులను జైలుకు పంపుతా అని చెప్పే… మోడీ.. ఆరూరికి ఎలా టికెట్ ఇచ్చారు, భవిష్యత్ లో కొండా మురళీ కి కుడా అవకాశం కల్పిస్తాం, వరంగల్ తూర్పు లో కడియం కావ్య కు భారీ మెజారిటీతో గెలిపించాలి, ఆ బాధ్యతను కొండా మురళీధర్ రావు కి అప్పజేపున్నా’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.