Site icon NTV Telugu

CM Revanth Reddy: కేటీఆర్ వంద శాతం ఆర్టిపిషల్.. జీరో ఇంటలిజెన్స్..

Revanth Reddy Ktr

Revanth Reddy Ktr

CM Revanth Reddy Talked about KTR: నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత కేటిఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ రెండు గంటలపాటు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.. కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను తప్పదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. పదేళ్లు పాలన చేసిన వారు పది నెలలు పూర్తి చేసుకోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. ఎంఎంటీఎస్ ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.. దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలి.. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు.. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగ మార్చుతామనలేదు.. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం.. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?

హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తున్నాం.. స్టీడియాలు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి., స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం., సిరాజ్.., నికత్ జరిన్ లకి అన్ని మినహాయింపులు ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నాం., అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంకి బీసీసీఐతో మాట్లాడినని., ఫార్మా సిటీ అని వాళ్ళు అన్నారు.. ఫార్మా విలేజ్ లు అని నేను అంటున్న అని ముచ్చర్ల లో గొప్ప నగరం సృష్టిస్తున్నట్లు తెలిపి.. కేటీఆర్ 100 శాతం ఆర్టిపిషల్.. జీరో ఇంటలిజెన్స్ అని కామెంట్స్ చేసారు.

Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో హీరోయిన్ మానుషి డేటింగ్‌?

Exit mobile version