NTV Telugu Site icon

CM Revanth Reddy Chit Chat: శ్వేతపత్రాలను అందరితో చర్చించిన తర్వాత విడుదల చేస్తాం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వవం విద్యుత్ ను కేవలం 12, 13 గంటలకు మించి ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేత పత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుంది.. శాసన సభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటాం.. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Man-Eating Tiger: “మ్యాన్ ఈటర్” పులి కోసం వేట.. చంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం..

అధికారుల నియామకంలో పైరవీలు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీపీలు ఎవరు కూడా పోస్టింగ్ ల కోసం నన్ను అడగలేదు అని తెలిపారు. అధికారుల హంటింగ్ ఉండదు.. అధికారుల బదిలీలు ఉంటాయి కానీ వెంటపడం అని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలి అనేది మా ఆలోచన.. జూబ్లీహాల్ కి మరిన్ని హంగులు దిద్దుతాం.. మీడియా ఆధారాలతో వార్తలు ప్రసారం చేస్తే మాకు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు.