CM Revanth Reddy: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాల్గొన్న 62 మంది విద్యార్థులు, అధికారుల బృందం హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన కార్యనిర్వాహక విద్య (Executive Education) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
రగ్డ్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్.. Mahindra Vision S స్పై డీటెయిల్స్ లీక్
ఈ కార్యక్రమం 21వ శతాబ్దంలో నాయకత్వం (Leadership in the 21st Century) అంశంపై నిర్వహించబడింది. రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిజీ షెడ్యూల్‌తో తరగతులు జరిగాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ శిక్షణలో పాలన, విధాన రూపకల్పన, ప్రజా పరిపాలనలో ఆధునిక సవాళ్లు, నాయకత్వ నైపుణ్యాలపై విస్తృతంగా చర్చించారు.

Prabhas : దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’.. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు నో డేట్స్..
ఈ శిక్షణ కార్యక్రమం -15 డిగ్రీల నుంచి -24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణంలో కొనసాగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం పూర్తి తరగతుల్లో పాల్గొని శిక్షణను పూర్తి చేయడం విశేషం. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో.. ఈరోజు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అధ్యాపకులు పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ శిక్షణ అనుభవం పాలనలో మరింత ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.