TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Chief Vijay: తమిళనాడు రాజకీయాల్లో వడివడిగా అధికారం కోసం అడుగులు వేస్తున్న హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ సమాచారం ఉండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అఫిడవిట్లలో కేసుల వివరాల విషయంలో వ్యత్యాసాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.
READ ALSO: Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అసలేం జరిగిందంటే..
ఈ ఎన్నికల్లో దళపతి విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆ రెండు చోట్లా ఆయన సమర్పించిన అఫిడవిట్లలో సమాచారం ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంది. పెరంబూర్ నియోజకవర్గం నుంచి దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఎటువంటి “క్రిమినల్ కేసులు లేవు” అంటూ విజయ్ క్లియర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇదే సమయంలో తిరుచ్చి ఈస్ట్‌లో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం తనపై ఒక పోలీస్ కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. 2025లో మదురైలో నమోదైన ఒక కేసు వివరాలు ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయని సమాచారం. పెరంబూర్ అఫిడవిట్‌లో ఈ కేసు ప్రస్తావన లేకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విజయ్ స్పందిస్తూ.. “సదరు కేసు గురించి తనకు ముందుగా సమాచారం లేదు” అని వివరణ ఇచ్చారు. అయితే, ఒకే సమయంలో రెండు చోట్లా రెండు రకాలుగా సమాచారం ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చట్టపరమైన చిక్కులు.. డిస్క్వాలిఫికేషన్ ముప్పు..
ఎన్నికల నిబంధనల ప్రకారం.. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా వాస్తవాలను దాచడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అఫిడవిట్‌లో వ్యత్యాసాలు ఉన్నట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సమాచారం ఉద్దేశపూర్వకంగా దాచారని నిర్ధారణ అయితే, అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం వరకు వెళ్లే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూను ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. “రాజకీయాల్లోకి రాకముందే విజయ్ ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులు ఇది కేవలం సాంకేతిక పొరపాటేనని వాదిస్తుంటే, ప్రత్యర్థులు మాత్రం ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు విజయ్ ఇచ్చిన వివరణను ఎలా స్పందిస్తారు అనే దానిపైనే ఇప్పుడు TVK అధినేత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..