Site icon NTV Telugu

RGV – Revanth Reddy: ఒకే ఫ్రెమ్ లో ఇద్దరు ఫైర్ బ్రాండ్స్..

Rgv Revanth Reddy

Rgv Revanth Reddy

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. మే 19న అంతర్జాతీయ డైరెక్టర్ల దినోత్సవంను తెలుగు మూవీస్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధికారిక కార్యక్రమంను జరుపుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ (టిఎఫ్ఐ) కి చెందిన పలువురు సీనియర్ దర్శకులు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని జరగబోయే ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించారు.

Also read: Narendra Modi Biopic: మోడీగా కనిపించనున్న కట్టప్ప..?

తెలుగు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ డైరెక్టర్ వీర శంకర్, ప్రముఖ దర్శకులు ఆర్జీవీ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, ఇతర సినీ దర్శకుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డైరెక్టర్లకు సీఎం, ఆయన సిబ్బంది ఘన స్వాగతం పలికి, ఈ కార్యక్రమానికి హాజరవుతామని హామీ ఇచ్చారు.

కానీ., ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన ఒక అంశం ఏమిటంటే., ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగడం. రామ్ గోపాల్ వర్మ, రేవంత్ రెడ్డి ఇద్దరిలోనూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇద్దరూ ధైర్యవంతులు, ఇద్దరు స్వయంగా పైకి ఎదిగినవారు.. అన్నిటికంటే ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ అనే పేరు ఉన్నవారు. అందుకే రేవంత్ రెడ్డి, రామ్ గోపాల్ వరమా క్రేజీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను.. అంటూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

Exit mobile version