ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి “చిత్రంలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. సత్యరాజ్ త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటించనున్నారు. సత్యరాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అనేక మీడియాలలో సమాచారం అందింది.
Also Read: TeamIndia: ఆ రోజునే న్యూయార్క్ బయలుదేరునున్న టీమిండియా ఆటగాళ్లు..
ప్రముఖ నటుడు సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో మోడీ పాత్రలో నటించనున్నాడని రమేష్ బాల ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా నరేంద్ర మోడీపై రెండవ బయోపిక్ అవుతుంది. ఎందుకంటే.’ 2019 లో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సంగతి గురించి నటుడు సత్యరాజ్ ఇంకా తన అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. వర్క్ ఫ్రంట్లో, సత్యరాజ్ చివరిసారిగా ‘సింగపూర్ సెలూన్’ చిత్రంలో కనిపించాడు. ఇంకా అతని తర్వాతి చిత్రానికి అధికారికంగా ఎటువంటి సంతకం చేయలేదు