NTV Telugu Site icon

CM Reveanth Reddy: సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Reveanth Reddy: హైదరాబాద్ లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ భద్రతలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు కేవలం వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

Read Also: Online Betting: బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో మారుతున్న నేరాల రూపానికి అనుగుణంగా పరిపాలనా విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం కోరారు. ఒకప్పుడు దోపిడీ చేయాలంటే దొంగలు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఒక్క క్లిక్ తోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలువునా దోచేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఇప్పటికే సైబర్ భద్రతను మెరుగుపర్చడంలో అగ్రభాగాన ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు చేసినవి సరిపోవు.. ఇంకా చాలా చేసేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్.. ట్రైలర్ రిలీజ్

డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.