Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Aims To Make Telangana Number One In Cyber Safety

CM Reveanth Reddy: సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్

Published Date :February 18, 2025 , 1:53 pm
By Kothuru Ram Kumar
  • సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి.
  • సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై అవగహన అవసరం.
  • సైబర్ భద్రతను మెరుగుపర్చడంలో తెలంగాణ పోలీసులు అగ్రభాగాన ఉన్నారన్న సీఎం.
  • సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యలు.
CM Reveanth Reddy: సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Reveanth Reddy: హైదరాబాద్ లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ భద్రతలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు కేవలం వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

Read Also: Online Betting: బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో మారుతున్న నేరాల రూపానికి అనుగుణంగా పరిపాలనా విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం కోరారు. ఒకప్పుడు దోపిడీ చేయాలంటే దొంగలు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఒక్క క్లిక్ తోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలువునా దోచేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఇప్పటికే సైబర్ భద్రతను మెరుగుపర్చడంలో అగ్రభాగాన ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు చేసినవి సరిపోవు.. ఇంకా చాలా చేసేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్.. ట్రైలర్ రిలీజ్

డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1930 Toll-Free Number
  • CM Revanth Reddy
  • Cyber Crimes
  • Cybercrime Control
  • Deepfake

తాజావార్తలు

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!

  • Induction Stove: భారత్‌లో ఒక్క రోజులో 20 రెట్లు అమ్మకాలు.. ఇండక్షన్ స్టవ్ ట్రెండ్ ఎందుకు?

  • MS Dhoni: ఐపీఎల్‌కు ముందు ధోనీకి బిగ్ రిలీఫ్.. “ఒప్పందాల” ఆరోపణలపై బీసీసీఐ సంచలన తీర్పు..

  • Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions