NTV Telugu Site icon

CM Revanth Reddy : 100 కోట్లు స్వీకరించబోం.. అదానీ గ్రూప్‌కి నిన్ననే లేఖ రాశాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు.. నిబంధనల మేరకు నిర్వహిస్తారని, ఎవరు టెండర్లలో రాణిస్తే వాళ్లకు ఇస్తారన్నారు. అదానే కాదు.. అంబానీ కి ఐనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని రాహుల్ గాంధీ చెప్పారని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ ఇచ్చారన్నారు. నాకేదో వ్యక్తిగతం గా ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, 18(b) కింద అనుమతి తీసుకున్నామని ఆయన తెలిపారు. నిన్ననే అదానీ గ్రూప్ కి లేఖ రాశామని, 100 కోట్లు స్వీకరించబోము అని.. అదానీ గ్రూప్ కి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. గొప్ప ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని, వివాదాలకు లోను అవ్వడం మాకు ఇష్టం లేదన్నారు. అదానీ గ్రూప్ నుండి 100 కోట్లు స్వీకరించ కూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. మమ్మల్ని ఆనవసర వివాదం లోకి లాగకండి అని, ఢిల్లీలో వెళ్లిన ప్రతీ సారి కేబినెట్ విస్తరణ అని రాస్తున్నారని, ఇప్పుడు ఢిల్లీలో ఓం బిర్లా కూతురు పెళ్లికి హాజరవడం కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన వెల్లడింఆరు. నేను..ఉత్తమ్ వెళ్తున్నామని, రేపు..ఎంపీల తో సమావేశం ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. అనుమతులపై కార్యాచరణ ప్రకటిస్తామని, ఎయిర్ పోర్ట్ లు అంశం పై మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకుని కలుస్తామన్నారు.

RGV: పరారీలో వర్మ.. ఆ ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో ?

అంతేకాకుండా..’పైరవీలో కోసం మేము వెళ్లడం లేదు. వాళ్ళ లాగ మోడీ కాళ్ళు పట్టుకోవడానికి పోవట్లే.. కేసులు నుండి తప్పుకోవడానికి వాళ్ళ లాగ పోము.. కేంద్రంతో మీరు అంటకాగి తెలంగాణకి అన్యాయం చేశారు. వాళ్ళ లాగ గవర్నర్ అనుమతి ఇవ్వకుండా పైరవీ కోసం పోవట్లే ఫార్మ్ హౌజ్‌లో పడుకుంటే ప్రయోజనం ఉండదు. ఢిల్లీలో ఎన్ని సార్లు ఐనా వెళ్తాం. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ కాకి గోల పట్టించుకోను. మీ క్షోభ చూస్తే.. మా కార్యకర్తల సంతోషంతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి.. అదానీ తో కాంట్రాక్టులు.. భూములు ఇచ్చింది వాళ్ళు అదానీ ఫ్లైట్ లో తిరిగింది వాళ్ళు.. అప్పనంగా మేము ఏం ఇవ్వం. గతంలో మీరు ఇచ్చిన హైవేలు.. డేటా సెంటర్‌లు.. మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలి. ఒప్పందాలు రద్దు చేయాలి అంటే న్యాయ నిపుణుల సంప్రదిస్తా.

నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటం బీఆర్‌ఎస్‌కి బాగా అలవాటు.. అదానీ దగ్గర.. నేను కేసీఆర్ లాగా ఇంత వంగి వంగి లేను కేసీఆర్ లాగ.. సిగ్గులేని వాడు.. నా గురించి మాట్లాడుతున్నారు… ఆయన ఇచ్చిన వాటిపై విచారణ కి సిద్ధమా..? కేటీఆర్.. కి జైలుకు పోతే సిఎం ఐత అనుకుంటున్నారు. ఆయన కంటే.. ముందు ఆయన చెల్లి పోయింది జైలుకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.. విచారణ అంటే.. చూశారా కేసులు పెడుతున్నారు అంటారు.. కేసీఆర్ లాగ అదానీ నుండి మేమేం నొక్కేయలేదు. వీటన్నిటిపై.. విచారణ చేయమంటావా.. అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ అదానీకి అప్పగించిన వాటి వివరాలను మీడియాకు చూపారు.

Nellore News: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి!