Site icon NTV Telugu

CM Revanth Reddy : గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం

Cm Revanthr Eddy

Cm Revanthr Eddy

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని, నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక వసతులు కల్పించాలన్నారు. అందుకే శాసనసభలో బిల్లును ఆమోదించి ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ లకు శంకుస్థాపన చేసుకున్నామ్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఆనాడు దేశంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యతనిచ్చారని, గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు.

 
Viral Video: 3 నెలల క్రితం తప్పిపోయిన మహిళ గుహలో నాగినిలా ప్రత్యక్షం.. పూజలు చేస్తున్న స్థానికులు
 

అంతేకాకుండా.. ‘స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందించనున్నాం. శిక్షణతో పాటు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే.. ఉద్యోగం గ్యారంటీ.. మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది.. న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించబోతున్నాం. ఇక్కడ హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్ ను అభివృద్ధి చేస్తాం.. భూమి కోల్పోయిన పేదలకు నేను మాట ఇస్తున్నా…
ఎవరూ అధైర్యపడొద్దు…మీ భవిష్యత్ కు భరోసా కల్పిస్తాం.. మీ పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.. ఇక్కడి నుంచి ఎయిర్ పోర్టు వరకు 200 ఫీట్స్ రోడ్డు నిర్మాణం చేస్తాం.. మెట్రోను అందుబాటులోకి తీసుకోస్తాం.. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నాం.. రీజనల్ రింగ్ రోడ్డు పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Maharashtra Shocker: బిల్డింగ్‌పై నుంచి ప్రియురాలిని తోసేసి హత్య..

Exit mobile version