NTV Telugu Site icon

CM Revanth Reddy : సదర్ అంటే యాదవుల ఖదర్..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని నేను ఆనాడే చెప్పా అని, ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని.. ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు రేవంత్‌ రెడ్డి. సదర్ అంటే యాదవుల ఖదర్ అని, సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలన్నారు. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించామని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

 
Delhi: ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల రికవరీ.. భద్రతా సంస్థలు అప్రమత్తం
 

అంతేకాకుండా..’మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడండి.. ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ది. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నాం. యాదవ సోదరులు అవాకాశాలను అందిపుచ్చుకోవాలి.. ఆనాడు ముషీరాబాద్ లో అంజన్ అన్నను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారు. అంజన్ అన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని అనిల్ కు రాజ్యసభ ఇచ్చాం.. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు.. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది.. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం..’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..