CM Revanth Reddy : ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం దండగ కాదు.. పండగలా అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఒకే విడతలో మొత్తం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రెండుసార్లు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కటాఫ్ డేట్ 2018 డిసెంబర్ 11గా తీసుకుంది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తుందని సీఎం ప్రకటించారు.
Also Read
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యకాలంలో తీసుకున్న పంట రుణాలను రూ.2లక్షల లోపు మాఫీ చేయనున్నారు. ఐదేళ్ల (2018 నుంచి 2023)లో తీసుకున్న క్రాఫ్ లోన్లను మాఫీ చేయడానికి రూ.31వేల కోట్లు అవసరమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌లో హామీల అమలుపై చర్చించామని, రాహుల్ గాంధీ మాట ఇస్తే.. మడమ తిప్పని నాయకుడు అని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ మాట ఇస్తే వెనుకడుగు వేయదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?