NTV Telugu Site icon

CM Revanth Reddy : ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు అని, అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారన్నారు మంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి. మేం అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్

అంతేకాకుండా..’ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల 22500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది. గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం.

ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మనది…ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి… పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదు’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kiran Abbavaram : క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ “దిల్ రూబా” నచ్చుతుంది

Show comments