Site icon NTV Telugu

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పై చేసిన వ్యాఖ్యలపై, ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో, బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా, పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు ఆడియో, వీడియో క్లిప్స్ సమర్పించారు.

Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీచైతన్య విద్యార్థులు

ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాత, ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో కొనసాగుతుంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో, నాంపల్లి కోర్టులో విచారణను ప్రారంభించకుండా, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే విచారణలో హాజరుకు మినహాయింపును కోరారు. ఈ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది.

Fraud: ఉప్పల్‌లో బట్టతల మీద వెంట్రుకలు మొలుపిస్తామని భారీ మోసం

Exit mobile version