NTV Telugu Site icon

CM Revanth Reddy: నిజామాబాద్ రైతుల పరిస్థితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది

Cm Revanth

Cm Revanth

నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని, చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో వంద మంది నామినేషన్లు వేశారన్నారు. 2019 లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని, ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడంటూ సీఎం రేవంత్‌ విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతులను ఆదుకుంటామన్నందుకు అర్వింద్ ను గెలిపించారని, మళ్లీ గెలిపించండి పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ ఇప్పుడు చెపుతున్నాడన్నారు. ఈ ప్రాంత రైతులంటే లెక్క లేదు.. మోసం చేయవచ్చునని మోదీ, ధర్మపురి అర్వింద్ అనుకుంటున్నారని, నిజామాద్ రైతుల పరిస్థితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి 150 రోజులైంది.. కేంద్రం నుంచి ఏం తెచ్చాడు..?  కేంద్రంతో మాట్లాడి  ఆర్మూర్ మున్సిపాలిటీ కి  మున్సిపల్ కార్యాలయం కూడా తేలేదు.. ఆర్మూర్ లో బీజేపీకి వేసిన ఓట్లు శుద్ధ దండగ అవుతాయి..
రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకువచ్చిన నరేంద్ర మోదీ మెడలు వంచి క్షమాపణ చెప్పించిన పౌరుషం పంజాబ్ రైతులది..  తెలంగాణలో ఆర్మూర్ , నిజామాబాద్ రైతులు కూడా పంజాబ్ రైతుల్లా కొట్లాడుతారు… పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాలన్నా జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి..  మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 47 కోట్లు బకాయిలు విడుదల చేసి చక్కెర కర్మాగారాన్ని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం..  500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనే బాధ్యత నాది..  9 వ తేదీ లోపు రైతు బంధు వేస్తా.. లేక పోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేసిన…  69 లక్షల మంది రైతుల అకౌంట్లలో  రైతు బంధు నిధులు వేశాం..  కేసీఆర్ సిగ్గుంటే అమరవీరుల స్థూపం లేకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి..    కేసీఆర్.. రైతు బంధు వచ్చిందో రాలేదో   ఏ రైతు ఖాతానైనా చూడు..

 

ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అంటే హరీష్ రావు రాజీనామా సవాల్ చేశాడు..  రుణమాఫీ చేసి సిద్దిపేట కు పట్టిన శనిశ్వరుడిని శాశ్వతంగా వదిలిస్తా.. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా…  దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు..  నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీ కి అవకాశం ఇచ్చారు..ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి…  ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం 16 కోట్లు మంజూరు ..  రాముడు కళ్యాణం కాకుండా ఎక్కడైనా అక్షింతలు పంచుతారా..?  రాముని కళ్యాణానికి 15 రోజులకు ముందే బీజేపీ వాళ్లు అక్షింతలు పంచారు.. ఇది దేవుని మోసం చేయడం కాదా.. .. హిందులను మోసం చేసినట్లు కాదా.. బీజేపీ వాళ్లు మనకు భక్తి, పూజల గురించి చెపుతారా..?  దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారు బిక్షగాడు అవుతాడు..’ అని సీఎం రేవంత్‌ అన్నారు.