CM Review: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారు సీఎం రేవంత్. కాగా.. ధరణి పై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ధరణి రద్దు..? సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. మండల కేంద్రంలో నెలకోసారి రెవెన్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ధరణి పేరును భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి సమస్యలపై ఇప్పటికే మీడియాలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ధరణిపై సమీక్ష నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి మెరుగైన ఆదాయ సేవల కోసం ‘భూమాత’ పేరుతో పోర్టల్‌ను తీసుకువస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేందుకు సమగ్ర భూ హక్కుల సర్వే చేపట్టి హక్కులు పునరుద్ధరిస్తామని తెలిపారు.
Read Also: Minister Seethakka: తొందరపాటు వద్దు.. కేటీఆర్ పై సీతక్క ఫైర్