NTV Telugu Site icon

CM Mamata Banerjee: ‘నాకు కుర్చీ వద్దు.. రాజీనామాకు సిద్ధం…’

Cm

Cm

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్యులు కూడా ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి.. షరతులతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని.. అలాగే 30 మంది డాక్లర్లు వస్తారని.. చర్చలకు సంబంధించిన విషయాలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE: KA Movie: ఆకట్టుకుంటున్న అందాల రాశి “తన్వీ రామ్”.. “క” లో రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్

తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆందోళన చేస్తున్న వైద్యుల మధ్య సమావేశం గురువారం కూడా జరగలేదు. ప్రభుత్వం మూడోసారి వైద్యులను చర్చలకు పిలిచింది. సిఎం మమతా బెనర్జీ కూడా చర్చల కోసం నబన్నలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యుల కోసం 2 గంటల పాటు వేచి ఉన్నారు. అయితే డాక్టర్ల ప్రతినిధి బృందం సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మొండిగా ఉండి సమావేశానికి హాజరు కాలేదు. వాస్తవానికి గురువారం నాడు మమత ప్రభుత్వం లేఖ రాసి సాయంత్రం 5 గంటలకు వైద్యులను చర్చలకు పిలిచింది. తన లేఖలో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కావాలన్న వైద్యుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే వారి షరతును ప్రభుత్వం తిరస్కరించింది. 30 మంది నిరసన తెలిపిన వైద్యుల ప్రతినిధి బృందానికి బదులుగా 15 మందిని మాత్రమే అనుమతించింది.

READ MORE: PM Modi: సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం

డాక్టర్లు చర్చల ప్రతిపాదనను అంగీకరించారు. నబన్న కూడా చేరుకున్నారు. ఈ సమావేశానికి 15 మందికి బదులు 32 మందితో కూడిన ప్రతినిధి బృందం వచ్చిందని, అనుమతి కూడా ఇచ్చామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. అంతేకాకుండా సమావేశాన్ని రికార్డు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ డాక్టర్ మాత్రం లైవ్ స్ట్రీమింగ్ విషయంలో మొండిగా ఉండడంతో కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్లలేదు. కాగా.. మమతా బెనర్జీ సమావేశానికి ఖాళీ కుర్చీల మధ్య రెండు గంటల పాటు ఒంటరిగా వేచి ఉన్నారు. దీని తర్వాత ఆమె వెళ్లిపోయియారు.

Show comments