NTV Telugu Site icon

CM KCR TOUR: జూన్ 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన

Kcr

Kcr

నిర్మల్ మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ క్యాడర్‌ను ప్రజలను సీఎం సభకు తరలించడానికి సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు ప‌లు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ శివారులో నిర్మించిన నూతన సమీపృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈనెల 9న సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సీఎం సభ విజయ వంతం కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్

మంచిర్యాల జిల్లా ఐడీఓసీ నూతన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1658 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు, మందమర్రి మండలంలో సుమారు Rs.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు అని తెలిపారు.

Also Read : Priya: ప్రియా ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టేశావా..?

మంచిర్యాల ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నమంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరి నదిపై రూ.164 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంచిర్యాల సభ వేదికగా రెండో విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఇడ్ల పట్టాల పంపిణీ పథకాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం తరువాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.

Show comments