Site icon NTV Telugu

Dalit Bandhu: రెండో విడత దళిత బంధుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

Dalitha Bandh

Dalitha Bandh

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న(శనివారం) రాత్రి తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

Read Also : Zelensky: పుతిన్ భయపడి ఎక్కడో దాక్కున్నాడు.. తిరుగుబాటుపై కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి ఈ దళిత బంధు పథకాన్ని అందించాలని ప్రభుత్వం చూస్తుంది. నిబంధల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో సంప్రదించి అసెంబ్లీ నియోజకవర్గానికి (హుజూరాబాద్ మినహా) 1100 ఎస్సీ కుటుంబాలను గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Akhil Akkineni: సినిమాల ఎంపిక విషయంలో తన తాతయ్య చెప్పింది ఫాలో అవబోతున్న అఖిల్..?

ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులను జారీ చేశాడు. హుజురాబాద్​ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు అనే పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు.​ఆ ప్రాంతంలో దాదాపు 14,400 మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో మరి ఎంతమంది దళితులకు ఈ దళిత బంధు అందుతోంది అనేది చూడాలి..

Read Also : Off The Record: సిట్టింగ్ ఎంపీకి ఈసారి టికెట్ డౌటేనా? వైసీపీ పరిశీలిస్తున్న పేర్లేంటి?

తొలి విడత దళిత బంధులో కేవలం ప్రజాప్రతినిధులకు చెందిన వారికే ఈ పథకాన్ని ఇచ్చినట్లు పలు విమర్శలు వచ్చాయి. కానీ.. అలాంటిది ఏమీ లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రతి ఒక్క దళితుడిని ధనవంతుడిని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Exit mobile version