NTV Telugu Site icon

CM KCR Wife Shobha Rao: శ్రీవారి సేవలో సీఎం కేసీఆర్‌ సతీమణి..

Shobha Rao

Shobha Rao

CM KCR Wife Shobha Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆమెకు ఆహ్వానం పలికి.. దగ్గరుండి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.. ఇక, స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు కేసీఆర్‌ సతీమణి శోభ.. శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నారామె.. మరోవైపు.. శ్రీవారి దర్శనం ముగించుకొని శ్రీకాళహస్తికి బయల్దేరి వెళ్లారామె. శ్రీవారి దర్శనం కోసం నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు శోభ.. ఆమె వెంట కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు..

Read Also: Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.. ఇక, నిన్న శ్రీవారిని 68,828 మంది భక్తులు దర్శించుకున్నారు.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,768గా ఉంది.. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా పేర్కొంది టీటీడీ. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం రోజు విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్‌ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండగా.. నవంబర్‌ 30వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.. డిసెంబర్‌ 3వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నట్టు తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.