NTV Telugu Site icon

CM KCR : నేనూ రైతునే.. నాకూ ఆ బాధ తెలుసు

Cm Kcr

Cm Kcr

వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అంతకుముందు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి, మామిడి, పంటలను పరిశీలించారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మొత్తం సుమారుగా75 నుండి 85 లక్షల ఎకరాలు సాగు చేయబడిందని, 54 ఎకరాల వరి సాగు అయ్యిందన్నారు. జీడీపీ కూడా భారత దేశానికి మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని, కరెంట్ కానీ, నీళ్ళు కానీ సమృద్దిగా వున్నాయన్నారు. కానీ ఈ రాళ్ల వానతో నష్టం ఏర్పడిందని, నేను స్వతహాగా రైతు నీ కాబట్టి ఆ బాధ నాకు తెలుసు అని ఆయన అన్నారు.

Also Read : AP High Court Shifting to Kurnool: కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన

రాష్ట్రం ఎలా తెచ్చుకున్నాం అన్ని మనం అలానే తెచ్చుకున్నామని, నేను హైదరాబాద్ నుండి ప్రకటన చేయొచ్చు కానీ నేను ఇక్కడ దాకా వచ్చి మీతో కలవడానికి వచ్చినానని ఆయన రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేడద్దని నేను కోరుకుంటున్నాని ఆయన అన్నారు. ఒక ఎకరాకు 10 వేల పంట నష్టం అందిస్తామని, ఈ సారి కౌలు రైతులకు కూడా అందుతుందన్నారు. 10వేల నష్ట పరిహారం మీ పెట్టుబడికి ఏ మాత్రం సరిపోదు అని తెలుసు అని, రైతులకు భరోసా ఇవ్వడానికే నేను ఈ పర్యటన చేస్తున్నానన్నారు.

Also Read : Tornado: కాలిఫోర్నియాలో సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్