CM KCR : నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్

Kcr Warangal

Kcr Warangal

CM KCR Tour in Warangal Today

నేడు వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దామెరలో ప్రతిమ వైద్యకళాశాల, ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అయితే.. వరంగల్ లో సీఎం కేసిఆర్ నాలుగు గంటల పర్యటన కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ బయలు దేరుతారు. ఉదయం 11.15 గంటలకు వరంగల్ కి చేరుకోనున్న సీఎం.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.

×
×
Ad

 

అనంతరం.. ములుగు రోడ్డులో జాతీయ రహదారి 163 పక్కన నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.