NTV Telugu Site icon

CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్‌

Kcr

Kcr

CM KCR: ఈ రోజు బీఆర్ఎస్‌ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై ఈ రోజు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నమాట..

Read Also: Wednes Day Bhakthi Tv Live: బుధవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..

తెలంగాణ రాష్ట్రం సాధనే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.. సింహగర్జన పేరుతో కరీంనగర్‌ బహిరంగ సభ మే 17, 2001న నిర్వహించారు.. ఇక, జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత అదే రోజు.. అంటే ఈ రోజు తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించబోతున్నారు.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.