CM KCR: వందకోట్ల వెనుక ఎవరున్నారు? తేల్చాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ హాట్ టాపిక్ అయింది. చండూరు బహిరంగ సభలో దీనిపై తీవ్రంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. తల మాసిన ఒకడు తడి బట్టలతో ప్రమాణం అంటున్నాడు. వందల కోట్లతో దొరికారు. ఆ దొంగలు జైల్లో ఉన్నారు. విషయం న్యాయ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం కూడా అదిరిపోయే పరిస్థితి ఉంది. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిని బంగాళా ఖాతంలో విసిరేయాలి. ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే వారిన తరిమేయాలన్నారు సీఎం కేసీఆర్.
ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారు. రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ది చెప్పారు. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని మా ఎమ్మెల్యేలు నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో వచ్చి చంచల్‌గూడ జైల్ లో ఉన్నారు. వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో విచారణలో తేలాలి. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదు. మోడీ రెండు సార్లు పీఎం అయ్యావు.. నీకేం కావాలి.
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
Read Also: Ponnala Lakshmaiah: ఫాంహౌస్ నుంచి రాజకీయం చేసేవాళ్లు.. దేశాన్ని ఎలా బాగుచేస్తారు?
మనం చైతన్యం కావాలి. దోపిడీ దారులు మాయమాటలు చెబుతారు. వారి మాటలు నమ్మవద్దు. నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు వంద కోట్లు ఇస్తామంటే ఎడమకాలి చెప్పుతో కొట్టారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు… ఇలాంటి వాళ్ళు కావాలి. 100 కోట్లు ఇస్తామంటే వద్దన్నారు. గడ్డిపోచలా వాటిని పడేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అక్రమ ధనం తెచ్చి.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే… ఇళ్ళు కాలిపోతాది. దేశంలో ఏమి జరుగుతున్నది ? కరిచే పాము అని తెలిసి మెడలో వేసుకుంటామా ?
కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక ఓటు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు.. పాము కరుస్తుందని తెలిసి.. ఆ పాముకి ఓటు వేద్దామా? చేనేతలు బీజేపీకి బుద్ధి చెప్పాలి.బిజెపికి తెలంగాణలో బుద్ధి చెప్పాలి . ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? డాలరుతో రూపాయి విలువ 82 రూపాయలా. అర్థం అయిన తర్వాత కూడా బుద్ధి చెప్పాలి. మీ ఓటే మీ ఆయుధం. నాటకాలు నడవవు. లక్షల కోట్లు పేదలకు చెందినది పెద్దలకు ఇస్తారా? ప్రభుత్వరంగంలోని కంపెనీలను కాపాడదామా? వడ్డు కొనుడు చేతకాదు.. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటారా? బీజేపీకి బుద్ధి చెప్పాలి… ఓటు ద్వారా మనం తిరుగుబాటు చేయాలి. మీ ఆటలు సాగవని మనం సందేశం ఇవ్వాలి. వామపక్షాలు, మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంటింటికి వచ్చి చెబుతున్నాం. అన్యాయం జరిగింది.. పెట్రోల్ ధర పెరిగింది.. జీఎస్టీమీద పోరాడాలి. కత్తి ఒకని చేతిలో పెట్టి వేరే వాడిని యుద్ధం చేయమంటే ఎలా? అన్నారు కేసీఆర్.
Read Also: Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!