NTV Telugu Site icon

CM KCR : దళితబంధు పుట్టించిన మొగోడు కేసీఆర్

Kcr

Kcr

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ దూసుకువెళ్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఖమ్మం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా అశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లిలో వెంకట వీరయ్య 70, 80 వేల మెజారిటీ తో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మీద నుంచి చూశా… ఇంకా రావాల్సిన వారు చాలా మంది… సండ్ర మీద అభిమానం తో వచ్చారన్నారు. సత్తుపల్లి చైతన్యం, ఆలోచన వున్న ప్రాంతమన్నారు. పోటీ చేసిన వ్యక్తులు అనుభవం, కార్యదక్షత చూడాలన్నారు సీఎం కేసీఆర్‌.

అంతేకాకుండా.. ‘పార్టీ ఎది, పార్టీ చరిత్ర, వైఖరి, ప్రజల గురించి ఆ పార్టీ ఏమి ఆలోచిస్తుంది అనేది చూడాలి. కులాన్ని ద్వేషించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి పరిణతి వచ్చిన దేశంలో అద్భుతాలు జరుగుతాయి. దళిత బంధు పుట్టించిన మొగుడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు బందు వుందా. ఎవ్వరూ దరఖాస్తు ఇవ్వకున్న డిమాండ్ చేయకుండా నేను ఇచ్చాను. ఓట్ల కోసం పెట్టలేదు. 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వస్తె వారి పరిస్థితి బాగాలేదు. అంటరాని వారు గా ఇబ్బందులు పడ్డారు. పేద పెడబొబ్బలు పెట్టే మూడు రంగులు, ఎర్ర రంగు జెండాలు దళితులను వాడుకున్నారు. ఎన్నికల్లో మోసాలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఆనాడే దళిత చైతన్య యాత్ర పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టని పథకాలు చాలా పెట్టాను. ఎన్నిక గడువాలి అన్న ఆలోచన మాకు లేదు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. కరోనా దరిద్రం, నోట్లు రద్దు లేకపోతే ముందే దళిత బందు పెట్టాను.

భట్టి నియోజకవర్గం లో పెట్టాను. మా ఎమ్మెల్యే కే పేరు రావాల్నేది మాకు లేదు స్వార్థ రాజకీయాల చేసే వారిని కాదు. ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం లో పెట్టాను… ఎన్నికల నోటిఫికేషన్ నెల ముందే వచ్చింది. దుర్మార్గులు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. బల్పు రాజకీయాలు చేసిన నేతలకు సీత రామ ప్రాజెక్ట్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆరునూరైనా ప్రభుత్వం మే వస్తోంది. అసెంబ్లీ వాకిలి తోక్కనివ్వను అంటున్నాడు ఒక్కరూ..
ఖమ్మం పహిల్వాన్ గా అసెంబ్లీలో సండ్ర, ఎంపీగా నామా అడుగుపెడుతాడు. నేను కూడా అంత అహంకారంతో మాట్లాడలేదు. ఇంత డబ్బు అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి.’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.