Site icon NTV Telugu

CM KCR : బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదు

Kcr Speech

Kcr Speech

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒక విషయంను మనం అంతా ఆలోచించాలని, దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, భారత్ భిన్నమైన దేశం దేశంలో ఉన్న పరిస్థితులపై చర్చించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదని ఆయన అన్నారు. 50 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నానని, దేశంలో అంతా మన కళ్ల ముందు ఉంది… సంపద ఉంది… వేరే వాళ్ళను అడిగే అవసరం లేదన్నారు. మహారాష్ట్రలో నీటికీ… కరెంటు కోసం ఉన్న ఇబ్బంది… దేశవ్యాప్తంగా ఉందన్నారు. భారతదేశ అవసరాన్ని కంటే ఎక్కువ నీరు మనకు అందుబాటులో ఉందని, మహారాష్ట్రలోని కిచిడి సర్కార్ నుంచి మమ్మల్ని రక్షించాలని అంటున్నారన్నారు.

Also Read : Andhrapradesh: ఏపీలో సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

జనం ఎవరికో ఒకరికి ఓటు వేస్తారు… దీనితో నేతలకు ఎటువంటి ఆలోచన లేదని ఆయన అన్నారు. గడ్చిరౌలి నుంచి గోదావరి నది వెళ్తుంది…మరి అక్కడ నీళ్ళు జనంకు ఎందుకు దొరకవని ఆయన ప్రశ్నించారు. భారత్ లో ప్రతి ఏటా ఒక లక్ష 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుందన్నారు. మన దేశంలో 50 శాతం భూమి యోగ్యమైనది… భారత్ మొత్తం ప్రపంచంకు ఆహారం అందించవచ్చన్నారు. దేశంలో దమ్ము ఉన్న సర్కార్ కంటే ప్రతి ఎకరం భూమికి సాగు నీరు అందించవచ్చని, బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యం దేశంలోని భూమికి సాగు నీరు అందాలన్నారు. మిషన్ భగీరథ తో తెలంగాణ లో అందరికి తాగు నీరు అందిస్తున్నామని, మహారాష్ట్రలో నదులు ప్రవహిస్తున్న… నీటి కోసం ఎందుకు ఇబ్బంది పడాలని ఆయన మండిపడ్డారు.

Also Read : Male Infertility: వీర్య కణాలు నాణ్యతను దెబ్బతీసే ప్రమాద కారకాలు ఇవే.. అధ్యయనంలో వెల్లడి..

Exit mobile version