NTV Telugu Site icon

CM KCR : మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం

Cm Kcr

Cm Kcr

నిజామాబాద్ రూరల్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతు బాగుంటే దేశం బాగుంటది అది ప్రణాళిక బద్దంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో నీటి పన్నులు వాసులు చేస్తే తెలంగాణ లో నీటి పన్ను రద్దు చేశామని, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. రైతు బంధును పుట్టించింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు, 24 కరెంట్ దుబారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి నీ బంగళాఖాతంలో వేస్తారట, ధరణి పోర్టల్ ఉన్నది కాబట్టే రైతుల భూములు సేఫ్ గా ఉన్నాయన్నారు. భూమి యాజమాన్య హక్కును మార్చే హక్కు ముఖ్యమంత్రి కి లేదని ఆయన అన్నారు.

Also Read : Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?

ధరణి తీసేస్తే రైతు బందు అమలు కష్టమని, ధరణి లేకుంటే మళ్లీ దళారుల రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాల పై ప్రజలు చర్చ జరపాలని, మానవీయ కోణం లో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని పథకాలు ఇస్తున్నామని, గిరిజనులు ఎక్కువగా ఉన్న రూరల్ లో 50 తండాలను గ్రామ పంచాయితీ లుగా మార్చామన్నారు సీఎం కేసీఆర్‌. 3వేల పొడు పట్టాలు ఇచ్చామని, ఇలాంటి మంచి పనులు ఏ ప్రభుత్వాలు చేయలేదని, మంచిప్ప రిజర్వాయర్ పనులు ఇజ్రాయిల్ టెక్నాలజీ తో నడుస్తున్నా యి.త్వరలో పూర్తి చేస్తామన్నారు. మాంచిప్ప రిజర్వాయర్ భూ నిర్వాసితులకు మంచి నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Also Read : Anam Venkata Ramana Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆనం సంచలన ఆరోపణలు