NTV Telugu Site icon

CM KCR : రైతులు హలం దున్నుడం కాదు.. కలం పట్టి దేశ చరిత్ర మార్చాలి

Cm Kcr

Cm Kcr

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ పెట్టానన్నారు. దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని, దేశంలో తాగు, సాగు, నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు కేసీఆర్‌. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతుల అత్మహత్యలు ఉన్నాయని, అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయని, దారులన్నీ మూసుకుపోయి ఏ ఆసరా లేనప్పుడే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్

అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనేదే బీఆర్ఎస్‌ తొలి నినాదమని, భారత్‌ తెలివిగల వాళ్ల దేశమని, ఎమర్జెన్సీ సమయంలో జేపీ పిలుపుతో జనం ఏకమయ్యారన్నారు. రైతులు హలం దున్నుడం కాదు.. కలం పట్టి దేశ చరిత్ర మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. మేం బలవంతులం అని అనుకునే నేతల పతనం తప్పదని, అప్పుడే దేశంలో రైతురాజ్యం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మేకిన్‌ ఇండియా జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిపోయిందని, మేకిన్‌ ఇండియా అంటారు.. కానీ అంతా చైనా బజార్‌గా మారిపోయిందన్నారు కేసీఆర్‌. మేకిన్‌ ఇండియా అంటే ఉండాల్సింది ఇండియా బజార్లు అని, 75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయన్న కేసీఆర్‌.. దేశం వెనుకబాటుతనానికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. ఒకరు అంబానీ అంటే.. ఇంకొకరు అదానీ అంటారని ఆయన మండిపడ్డారు.

Also Read : Crime News: 58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఆపై..