Site icon NTV Telugu

CM KCR : బీఆర్‌ఎస్‌ అధికారంలో వస్తే.. దేశమంతా దళితబంధు

Cm Kcr 2

Cm Kcr 2

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రైతులది జీవన్మరణ సమస్య అని, చాలా దేశాల్లో 5వేల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయని, మన దేశంలో ఆ స్థాయిలో ప్రాజెక్టులు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెడతామంటే ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని, తెలంగాణలో రైతు సహజ మరణం పొందినా 8 రోజుల్లో రూ.5లక్షలు ఇంటికి చేరుతాయన్నారు కేసీఆర్‌. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటోందిని, ప్రతి ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావని ఆయన ప్రశ్నించారు.

Also Read : tack in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..

రైతు ప్రభుత్వాలు లేవు కాబట్టే ఆ రాష్ట్రాల్లో ఇవన్నీ అమలు కావడం లేదన్నారు. దేశంలో బొగ్గును సద్వినియోగం చేసుకుంటే 125 ఏళ్లు కరెంటు సమస్య ఉండదని, ప్రభుత్వాలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు.. కానీ, రైతుల దుస్థితి ఎందుకు మారడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేరని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో గులాబీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మహారాష్ట్ర స్వరూపాన్ని మార్చండని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళిత బంధు చేస్తామని, తెలంగాణలో ఇది చేసి చూపించామని కేసీఆర్‌ అన్నారు.

Also Read : Madhya Pradesh: లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..

Exit mobile version