CM KCR : చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అయితే.. ఈ సభలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పొన్నాల లక్ష్మయ్యకు సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జనగామ, భువనగిరి గ్రోత్ కారిడార్‌లుగా మారాయి. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే తాలూక జనగామ అని, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతారు. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా, జనగామలో మాత్రం రాదు. గులాబీ జెండా ఎగరగానే చంద్రబాబు వెళ్లి దేవాదులకు శంకుస్థాపన చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం వచ్చాక మూడు నాలుగు నెలలు మేథోమధనం చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది. కరెంట్ కష్టాలు లేవు, నీటి కొరత లేదు, పుట్లకొద్ది పంటలు పడుతున్నాయి. భూమిపై రైతుల హక్కులు వారికే ఉండాలి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రైతుల బాధ నాకు తెలుసు, అందుకే భూమిపై అధికారుల అధికారాన్ని తీసేశాం. మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చాం. పాస్‌బుక్‌లో కాంగ్రెస్ వాళ్లు కౌలు రైతులను చేర్చాలంటున్నారు. నా ప్రాణం పోయినా సరే అది మారనివ్వను. టీపీసీసీ చీఫ్, సీఎల్పీ నేత భట్టి ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. కాంగ్రెస్‌కు ఓటు వేసే వేస్తే వీఆర్‌వోలు వస్తారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. 24 గంటలు కరెంట్ కొనసాగాలంటే కాంగ్రెస్‌ను శిక్షించాలి. రైతు బీమా తరహాలో రాష్ట్రంలో అందరికీ బీమా వర్తింపు. సహజ మరణమైనా సరే రూ. 5లక్షలు ఇస్తాం. ‘ అని సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!