NTV Telugu Site icon

CM KCR : 2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు..

Kcr

Kcr

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారని, 24గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుంటా అన్నారు జానారెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. 24గంటల కరెంట్ ఇచ్చి నేను మాట నిలబెట్టుకున్న అని, జానారెడ్డి మాత్రం మాట నిలబెట్టుకోలేదన్నారు సీఎం కేసీఆర్‌. జానారెడ్డి పంచరంగుల కల కంటున్నారు సీఎం అవుతా అని, సాగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ లను పూర్తి చేసి.. నేనే ప్రారంభిస్తానన్నారు సీఎం కేసీఆర్‌. నీటి తిరువా రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు కేసీఆర్‌. బీఆర్ఎస్ గెలిస్తేనే… రైతులకు రైతు బంధు వస్తుందని, 24గంటల కరెంట్ ఉండాలి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండాలన్నారు. ధరణి తీసేస్తే దళారి రాజ్యం వస్తుందని, సాగర్ లో 70 వేల మెజారిటీతో బి.ఆర్.ఎస్ అభ్యర్థి భగత్ గెలుస్తారన్నారు సీఎం కేసీఆర్‌.

Also Read : Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే

‘‘50 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. కాంగ్రెస్ పాలనలో మన బతుకులు మారాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకున్నాం.అధికారంలోకి వచ్చాక గిరిజన బంధు ఇస్తాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా? మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. నిరంతరాయ విద్యుత్ వద్దు.. 3 గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఎన్నికలనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారు’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Also Read : Gudivada Amarnath: ఢిల్లీలో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌