Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నలనటిగా తెలుగువారికి సుపరిచితమైంది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న అవికాను చూసి అమ్మడికి తిరుగులేదు అనుకున్నారు. కానీ, అవికాకు మాత్రం అంతగా పేరు దక్కలేదు. అడపాదడపా స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా స్టార్ హీరోయిన్ రేస్ వరకు కూడా వెళ్ళలేదు. ఇక ఆ తరువాత ఈ భామ మిగతా భాషల్లో కూడా తన సత్తా చూపడానికి ప్రయత్నించింది కానీ, అది కూడా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. ఇకపోతే ఈ మధ్య వెబ్ ఒరిజినల్స్ కు బాగా డిమాండ్ పెరగడంతో స్టార్స్ సైతం ఓటిటీ బాట పడుతున్నారు. ఇక తాజాగా అవికా కూడా ఓటిటీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే నెట్, మ్యాన్షన్ 24 లాంటి సిరీస్ లో కనిపించి మెప్పించిన అవికా.. ప్రస్తుతం వధువుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోయ్‌చాయ్‌లో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్ ను తెలుగులో వధువు పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
Also Read
అవికా గోర్, అలీ రెజా, నందు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్.. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా .. తాజాగా వధువు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక టీజర్ లో అవికా వధువుగా కనిపించింది. పెళ్లి ఆపాలని కొందరు ట్రై చేసినా అలీ తో ఆమె పెళ్లి అవుతుంది. అత్తగారింటికి వెళ్లిన దగ్గరనుంచి ఆమె అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అత్తగారి కుటుంబం కొత్త కోడలికి చెప్పకుండా దాచిన రహస్యాలను నవ వధువు తెలుసుకుంటుందా.. ? అసలు ఆ కుటుంబంలో ఉన్న రహస్యాలు ఏంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సిరీస్ తో అవికా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!