NTV Telugu Site icon

CM KCR : దేశ భవిష్యత్‌ కోసమే బీఆర్‌ఎస్‌

Kcr

Kcr

ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్ ఈ రోజు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్‌ కోసమే బీఆర్‌ఎస్‌. చైనా కంటే కూడా మన సంపద ఎక్కువ. కానీ అమెరికా, చైనా అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయి.? 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. దేశంలో పూర్తిస్థాయిలో సాగునీరూ అందడం లేదు. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించినట్టు.? అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ మ‌హా సంగ్రామంలోక‌లిసి వ‌స్తున్న ఒడిశా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స్వాగ‌తం. న‌వ నిర్మాణ్ కృష‌క్ సంఘ‌ట‌న్ క‌న్వీన‌ర్ అక్ష‌య్ కుమార్ పార్టీలో చేర‌డం సంతోష‌క‌రం. ఎంతో దూరం నుంచి వ్య‌య‌ప్ర‌యాసాల‌కోర్చి వ‌చ్చిన వారంద‌రికి స్వాగ‌తం తెలిపారు సీఎం కేసీఆర్‌. దేశంలోని క్రియాశీల నాయ‌కుల్లో గ‌మాంగ్ ఒక‌రు. రైతుల త‌ర‌పున గ‌మాంగ్ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. గ‌మాంగ్ రాజ‌కీయ జీవితం మ‌చ్చ‌లేనిది. గ‌మాంగ్ చేరిక నాకు వెయ్యి ఏనుగుల బ‌లం లాంటిది అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.

Also Read : USPC : పైరవీ బదిలీలు ఆపాలి.. జిల్లా కేంద్రాల్లో నిరసనలు

అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే వ‌న‌రులు ఎక్కువ ఉన్నాయి. కానీ మ‌న దేశం అభివృద్ధి చెంద‌డం లేదు. భార‌త్ త‌న ల‌క్ష్యాన్ని మ‌రిచింద‌ని పేర్కొన్నారు. దేశ యువ‌త అమెరికా వెళ్లేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు వ‌స్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో స‌రిప‌డా నీళ్లున్నా పొలాల‌కు మ‌ళ్ల‌వు, స‌రిప‌డా క‌రెంట్ ఉన్న చీక‌ట్లు తొల‌గ‌వు. ప్ర‌భుత్వాలు మారినా రైతులు, కార్మికుల ప‌రిస్థితి మార‌లేదు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అన్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే నాయ‌కుల‌కు ల‌క్ష్యంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏదో ర‌కంగా ఓట్లు సంపాదించుకోవ‌డ‌మే రివాజుగా మారింది. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ తాగ‌డానికి నీళ్లు ఇవ్వ‌ట్లేదు. ఒడిశా మ‌హాన‌దిలో ఎంత శాతం నీళ్ల‌ను వాడుకుంటున్నా. ఈ 75 ఏండ్ల‌లో మ‌నం ఏం సాధించిన‌ట్టు? జాతి, ధ‌ర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు.. కానీ తాగ‌డానికి గుక్కెడు నీళ్లు ఇవ్వ‌రని కేసీఆర్ మండిప‌డ్డారు.

Also Read : Rachha Ravi: జబర్దస్త్ నటుడు రచ్చ రవి ఆరోగ్య పరిస్థితి విషమమంటూ వార్తలు.. క్లారిటీ ఇదే