CM KCR: కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత, సుభాష్ రెడ్డిలతో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో తమతో కలిసి పని చేయాలనీ సుభాష్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. కామారెడ్డి నియోజకవర్గంలో 6 కోట్ల సొంత నిధులతో సుభాష్ రెడ్డి పాఠశాలను నిర్మించారు. సుభాష్ రెడ్డి సేవలు రాజకీయాల్లో అవసరమని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయంపై సుభాష్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Also Read: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నందున కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. ప్రతిపక్షాలు కూడా ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు భిక్కనూర్, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాలు రామారెడ్డి, రాజంపేటలోని కొన్ని గ్రామాలు వస్తాయి. అయితే ఈ నియోజకవర్గంలో మూడు పర్యాయాలుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలుపొందారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. కేసీఆర్‌ను కామారెడ్డిలోను ఓడించేందుకు ఈ రెండు ప్రధాన ప్రతిపక్షాల అధిష్ఠానం దృష్టి సారించి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.