Site icon NTV Telugu

CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష

Cm Kcr

Cm Kcr

CM KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి ప్రతిరోజూ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ముఖ్యమంత్రికి వివరించారు. దేశం గర్వించేలా నిర్మించిన అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఉద్యోగులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని ప్రారంభించి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల లభ్యతపై సీఎస్ శాంతకుమారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..

సచివాలయం పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల అధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాలను ఒకే చోట ఏకీకృతం చేయడంపై సీఎం చర్చించారు. హెచ్‌ఓడీ అధికారులు తరచూ సచివాలయంలో పని చేస్తున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను సచివాలయానికి సమీపంలోనే ఒకేచోట నిర్మించాలని సీఎం నిర్ణయించారు. అన్ని రంగాల ప్రభుత్వ శాఖల హెచ్‌ఓడీలు, వారి కింద పనిచేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య తదితర అంశాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి అందుబాటులో ఉన్న విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయని సీఎం ప్రశ్నించారు. స్థల నిర్ధారణ అనంతరం హెచ్‌ఓడీలందరూ ఒకేచోట ఉండేలా ట్విన్‌టవర్ల నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారు.

Read Also:MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు

Exit mobile version