తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు కొత్తేమీ కావు. కాకపోతే.. ఈ సారి ఫిరాయింపులంటూ మొయినాబాద్‌లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఏసీపీ న్యాయమూర్తి ముందు హాజరుపరుచగా రిమాండ్‌ను తిరస్కరించింది. అయితే.. ఈ ఘటనపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాకుండా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు ఈ వ్యవహారానికి సూత్రదారి అని.. లేకుంటే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి ప్రమాణం కోసం రావాలని సవాల్ చేశారు.
Also Read : Bhumana Karunakar Reddy: రాజకీయం వద్దు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొయినాబాద్ ఫాంహౌస్‌కు సంబంధించి ఏమైనా ఆధారాలు బయటపెడతారా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. మరోవైపు.. నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.
