NTV Telugu Site icon

CM KCR: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ

Cm Kcr

Cm Kcr

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.

Read Also: Nidhi Agarwal : తన సినీ కెరీర్ గురించి దిగులుపడుతున్న నిధి అగర్వాల్..?

స్థిత స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ.. దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పీవీ నర్సింహారావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని ఆయన వెల్లడించారు.

Read Also: Harassment: ఆసుపత్రిలో మహిళపై లైంగిక దాడికి యత్నం.. నర్సింగ్ అసిస్టెంట్ అరెస్ట్

పీవీ నర్సింహారావు సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని, వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఠీవి మన పీవీ’ అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Minister KTR: ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా

ఇక.. పీవీ నర్సింహారావు కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి కూడా ఘన నివాళులు ఆర్పించింది. దేశం ప్రమాదపు అంచుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు అని ఆమె అన్నారు. విదేశీ సంబంధాలను చాలా ఇంప్రూవ్ చేశారు.. అలీన విధానం ద్వారా దేశ పరిస్థితులను పూర్తిగా మార్చేశారు.. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చేశారు.. పీవీ నర్సింహా రావుకి భారతరత్న ఇవ్వడం అంటే… భారతరత్న అవార్డుకే గౌరవం ఇచ్చినట్టు అని ఎమ్మెల్సీ సురభి వాణి దేవి తెలిపారు.