మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదు అని ఆయన తెలిపారు. దీంతో కాసేపట్లో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు.
Read also: Police Case: ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి.. కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తోంది.. అవినీతి రహిత పాలన అందించాం.. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఉందన్నారు. బాన్సువాడలో పోచారం లక్ష మెజార్టీ తో గెలుస్తారు.. మళ్ళీ పెద్ద హోదాలో ఉంటారు.. ముస్లిం మైనార్టీల కోసం 2 వందల స్కూళ్ళు ఏర్పాటు చేశామన్నారు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేము.. చేతగాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్ పై కత్తి పోట్లకు ఒడిగట్టారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ దాడి అరాచకం, దుర్మార్గం, గెలిపిస్తే పనిచేయాలి గాని గుండాయిజం చేయొద్దు.. ఇది కేసీఆర్ పై దాడిగా భావిస్తాము.. హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి.. మా సహనాన్ని పరీక్షించొద్దు అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..
ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.