ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎంతో మంది సీఎంలు మారినా… ప్రజల దుస్థితి అలాగే ఉందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని… అందుకోసం బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామని తెలిపారు. అన్నంపెట్టే రైతులు చట్టాలు చేయలేరా..? మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసేంత వరకు మేం పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Suvarna Bhumi Fraud: నకిలీ రసీదులతో మోసం.. సువర్ణభూమి ఎండీతో పాటు పలువురిపై కేసు
దేశంలో సరిపడా కరెంట్ ఉన్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో రైతుల ఎలా చనిపోయినా రైతు బంధు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు చేరాలని, దేశంలో మార్పు తెచ్చే అంశం మహారాష్ట్రతోనే మొదలవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ అమలు చేస్తే మహారాష్ట్రను వదిలేసి మధ్యప్రదేశ్ వెళ్తాం. మంచినీటి సమస్య సైతం తీరుతుందని ఆయన అన్నారు. వ్యవసాయానికి ఇచ్చే కరెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, మరో 6 నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. గత నెల 22న మహారాష్ట్రలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ ప్రారంభించింది.
Also Read : AAP: “దేశానికి ఎప్పటికి ప్రధానిగా నరేంద్ర మోడీనే”.. ఆప్ సంచలన వ్యాఖ్యలు..
