Site icon NTV Telugu

CM KCR : ఈరోజు, రేపు ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్

Cm Kcr

Cm Kcr

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ములాయం భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నిన్న నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌ అక్కడి నూతనంగా నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. అయితే.. ఢిల్లీలో వారం రోజుల పాటు మకాం వేయనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు, మేధావులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

 

అంతేకాకుండా.. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చుతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రకటన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ వివిధ పార్టీల నేతలు, మేధావులతో కేసీఆర్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. జాతీయ నేతలు, రైతు సంఘాల, రిటైర్డ్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోనూ భేటీ అయ్యే అవకాశ ఉంది. బీఆర్‌ఎస్‌ భవిష్యత్ కార్యచరణపై ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు.

Exit mobile version