Site icon NTV Telugu

CM KCR : 5 లక్షల మందితో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సమావేశం

Kcr

Kcr

సీఎ కేసీఆర్‌ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. మూడు రాష్ట్రాల నుంచి సీఎంలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు కేసీఆర్‌. అయితే.. ఖమ్మం సభకు పువ్వాడ అజయ్‌ కుమార్‌తో పాటు మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి భాద్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3లక్షలకుపై జనసమీక్షరణ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

Also Read : Sankranti 2023: పల్లె బాట పట్టిన పట్నం.. అదనపు ఛార్జీల మోత..!

ఖమ్మం సభకు నల్గొండ, మహబూబాబాద్, తో పాటు ఏపీ బార్డర్ ప్రజలు వస్తారని, నాలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం, ఇద్దరు మాజీ సీఎంలకు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సభలో బీఆర్‌ఎస్ ఎజెండా, పలు విధివిధానాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Sankranti 2023: పల్లె బాట పట్టిన పట్నం.. అదనపు ఛార్జీల మోత..!

Exit mobile version