Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

KCR

KCR

ప్రగతిభవన్ లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ఈ సందర్భంగా తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్… పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

read also : ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్లాన్‌లో ఎమ్మెల్సీ తోట!

కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైనా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్‌. జల వివాదం విషయంలో పార్లమెంట్‌ లో ఎలా ముందుకు వెళ్లాలనే దానికిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా… అటు ఏపీ తరపున పార్లమెంట్‌ లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వైసీపీ యోచిస్తోన్న సంగతి తెలిసిందే.

Exit mobile version