NTV Telugu Site icon

CM KCR : ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Cm Kcr

Cm Kcr

ఢిల్లీలోని బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని రేపు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అయితే.. నిన్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులను పరిశీలించారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సంద‌ర్శించిన కేసీఆర్‌.. అక్కడి వారికి పలు సూచనలు చేశారు. రేపు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మధ్యాహ్నం.12.37 నుంచి 12.47 మధ్య కేసీఆర్ ప్రారంభించనున్నారు. రేపు బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయిని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read : Amara Raja: ఆ ప్రచారానికి ఇలా చెక్‌.. ఏపీలో అమరరాజా రూ.250 కోట్ల పెట్టుబడి..
బీఆర్‌ఎస్ పెట్టడం కేసీఆర్ సైనికుడిగా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి పంజాబ్, హరియణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. అఖిలేష్‌, కుమారస్వామి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఆహ్వానించామని పేర్కొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఢిల్లీలోని బీఆర్​ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రుత్వికులు యాగాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి హస్తిన చేరిన బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
Also Read : Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని

Show comments