Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Kcr Inaugurated Manchirial District Collectorate

CM KCR: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Published Date :June 9, 2023 , 6:36 pm
By Mahesh Jakki
CM KCR: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టరేట్ శిలాఫ‌ల‌కాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. నూత‌న క‌లెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజ‌ల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. క‌లెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దివాక‌ర్ రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామ‌న్న, రేఖా నాయ‌క్‌తో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంచిర్యాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవం నేపథ్యంలో రెండో విడత గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ గొర్రెల పంపిణీని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు రూ.11 వేల కోట్ల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్‌గా.. ఒక్కో యూనిట్ ధర రూ.లక్షా 25 వేలుగా నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం 75 శాతం అంటే రూ.93 వేల 750 భరిస్తుంది. లబ్ధిదారుడి వాటా ధనం 25 శాతం రూ.31 వేల 250 చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు గొర్రెల యూనిట్‌తో పాటు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • cm kcr manchirial tour
  • Collectorate
  • Manchirial District
  • telangana

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions