NTV Telugu Site icon

CM KCR: తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా..

Cm Kcr

Cm Kcr

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో నాకు చివరి సభ ఇది 96వ సభ అని పేర్కొన్నారు. గజ్వేల్ నుంచి నాకు అవకాశం ఇచ్చి నన్ను సీఎం చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, సచ్చేది లేదని మండిపడ్డారు.

Soma Bharat: కాంగ్రెస్ ఏకే గోయల్‌కు క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం

తెలంగాణ ఏర్పడ్డ మొదటిలోనే మన శత్రువులు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని.. మన ఎమ్మెల్యేలను కొనాలని చూసారని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.5016 పెన్షన్ ఇస్తామని తెలిపారు. రైతు బంధుని సృష్టించింది కేసీఆర్ అని అన్నారు. ధరణితో ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని మీకే ఇచ్చింది.. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తాం అంటున్నారు.. రైతు బంధు దుబారా అని ఉత్తమ్, మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ అంటున్నారని మండిపడ్డారు. మూడు గంటల కరెంట్ సరిపోతుందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందిని తెలిపారు. తెచ్చుకున్న రాష్టం ఇంకా బాగుపడాలి.. ఫిబ్రవరి వస్తే నాకు 70 ఏళ్ళు వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకుంది.. నాకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు.
ఇందిరా, నెహ్రు కాలంలోనే దళితుల అభివృద్ధికి చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.

Chandrababu: చంద్రబాబుకు బెయిల్ షరతులు విధించిన సుప్రీంకోర్టు

గజ్వేల్ లో గెలిచిన తరువాత ప్రతి దళితునికి దళితబంధు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. మీరు గజ్వేల్ లో రెండు సార్లు గెలిపించారు.. ఈ సారి మళ్ళీ ఆశీర్వదిస్తే మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. కొండపోచమ్మ, నాచారం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా.. గజ్వేల్ లో ఐటీ టవర్ పెట్టె బాధ్యత నాది అని చెప్పారు. ముంపు గ్రామ ప్రజల త్యాగమే 12 జిల్లాలకి నీటిని పంపించే ఘనత అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నిర్వాసితులకు పరిశ్రమలు పెట్టి వారికి ఉపాధి కల్పిస్తాం.. కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. మన మీద కుట్రలు చేసే బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని విమర్శించారు. గజ్వేల్ కి మీరు ఏది కోరితే అది వస్తుంది.. గజ్వేల్ రింగ్ రోడ్డు అద్భుతంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.