NTV Telugu Site icon

CM KCR : ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి

Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు కలిసి ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరాయని ఆయన అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని, సామాజిక ఉద్యమం ద్వారా వచ్చి ఆప్‌, మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ స్పష్టమైన మెజార్టీతో గెలిచిందన్నారు. అయినా మేయర్‌ ప్రమాణస్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారని, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి మేయర్‌ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Also Read : Sr NTR: అధ్యయనం చేయవలసిన యన్టీఆర్ 100 చిత్రాలు

అంతేకాకుండా.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని, అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్ర ఆర్డినెన్స్‌ తెచ్చిందని, పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలని, ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉందని ఆయన అన్నారు. ప్రజలు మోడీ సర్కార్‌కు గట్టి బుద్ధి చెబుతారని, కర్నాటక ప్రజలు బీజేపీకి బుద్దిచెప్పారన్నారు. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారని, ఈ గవర్నర్ల వ్యవస్తేంది.? బడ్జెట్‌ను పాస్‌కానివ్వనని గవర్నర్‌ అంటే ఎలా.? సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇంత దౌర్భగ్యపరిస్థితి ఎక్కడైనా ఉంటదా.? గవర్నర్‌ అలంకారప్రాయమైన పదవి. కర్నాటకలో కర్రుకాల్చి వాత పెట్టినా కేంద్రం మారకపోతే ఎలా.? అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Also Read : North Korea: బైబిల్‌తో పట్టుబడిన తల్లిదండ్రులకు మరణిశిక్ష..2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు