NTV Telugu Site icon

CM KCR Election Campaign: నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసిఆర్ పర్యటన..

Cm Kcr

Cm Kcr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో బీఆర్ఎస్​ అభ్యర్థులకు సపోర్టుగా గులాబీ అధినేత ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును తెలియజేస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరిస్తున్నారు.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: Dhruva Nakshathram postponed: విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా

ఇక, ఇదే సమయంలో రేపు (శనివారం) జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టీఎస్​ఐఐసీఛైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి తలసాని సభా వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే వాటిని సీఎం ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక, మరో వైపు విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. వారి వైఖరిని ఖండిస్తున్నారు.