Site icon NTV Telugu

CM KCR : మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తుంది నా తెలంగాణ

Cm Kcr

Cm Kcr

సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తుంది నా తెలంగాణ అని వ్యాఖ్యానించారు. 72 నియోజకవర్గాలలో ఎన్నికల్లో ప్రచారం చేశా… మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ… గతంలో పంట ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని, 50 ఏళ్ళు కాంగ్రెస్ రాష్ట్రాన్ని గోస పెడితే… పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే సూర్యాపేటలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారమైందని, నీటి తీరువా రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన అన్నారు. ధరణి తీసేస్తే దళారీ రాజ్యం వస్తుందని, ఫ్లోరైడ్ నీటిని తాగించి జిల్లా ప్రజలను గోసపెట్టారు కాంగ్రెస్ నేతలు అని ఆయన మండిపడ్డారు.

Heart Attack: AIతో గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు.. ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి..

తాగునీరు కూడా ఇవ్వాలేని అసమర్థులు జిల్లా కాంగ్రెస్ నేతలు అని కేసీఆర్‌ విమర్శించారు. డబ్బు మదం… అహంకారంతో కాంగ్రెస్ నేతలు వీర్రవీగుతున్నారని, సమర్థవంతమైన పాలనతో రాష్ట్ర తలసరి ఆదాయం పెంచుకున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే…. కేంద్రం మనకు రావలసిన నిధుల్లో కోత పెట్టిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టలేదని నిర్మల సీతారాం రామన్ మాట్లాడడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జిల్లాలో ఎంత మంది మంత్రులు కాలేదు..? జ‌గ‌దీశ్ రెడ్డి చేసిన ప‌ని ఒక్క మంత్ర‌న్న చేసిండా..? ద‌క్షిణ తెలంగాణ‌లో మెగా ప‌వ‌ర్ స్టేష‌న్ పెట్టాలంటే న‌ల్ల‌గొండ‌లో పెట్టాల‌ని కోరిండు. కృష్ణా న‌ది ఒడ్డున జాగ చూసి 30 వేల కోట్ల‌తో యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ నిర్మాణం అవుతోంది. న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట జిల్లా రూప‌రేఖ‌లు మారిపోతాయి. ఆర్థిక శ‌క్తి పెరుగుతది అని కేసీఆర్ తెలిపారు.

Kottu Satyanarayana: చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి వైదొలగాల్సిందే..!

Exit mobile version