NTV Telugu Site icon

CM KCR: ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి..

Kcr

Kcr

నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. పొడు పట్టాలు ఇచ్చుకున్నాం.. గిరిజనులకు రైతు బంధు ఇచ్చాము అని తెలిపారు. నిర్మల్ కు ఇంజనీరింగ్ కాలేజీ అడిగారు.. ఇక్కడి అభ్యర్థి మెజార్టీ 70, 80 వేలు దాటాలి.. మంజూరు చేయిస్తాను అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. గడబిడ లేదు.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాము అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Read Also: Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?

కాంగ్రెస్ పార్టీ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు.. మూడు గంటలు కావాలా 24 గంటల కరెంట్ కావాలా అని ఆయన ప్రశ్నించారు. ధరణితో రైతులు నిశ్చింతగా ఉన్నారు.. ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి.. పార్టీల చరిత్ర చూడాలి అని సీఎం చెప్పుకొచ్చారు. మా తండాల్లో మా రాజ్యం అంటే తండాలు, గూడెలను గ్రామ పంచాయితీలుగా చేశాం.. 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాము.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పైరవీ కారులు పుట్టుకొస్తారు అంటూ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also: IND vs SL: తొలి ఓవర్లనే రోహిత్ శర్మ ఔట్.. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు

తెలంగాణ రాష్ట్రంలో అభివృధి కొనసాగాలంటే బీఆర్ ఎస్ గెలవాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం 15 ఏళ్లు పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నామని సీఎం అన్నారు. నేను చెప్పే మాటలను గ్రామాల్లో, మీ బస్తీల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ సూచించారు. 30వ తారీఖున ఓట్లు వేస్తారు.. డిసెంబర్ 3న లెక్క తీస్తారు.. ఎవరో ఒకరు గెలుస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక ఓటు వజ్రాయుధం అన్నారు.